December 8, 2009
శ్లో II
జన్మనా జాయతే శూద్రః , కర్మణా జాయతే ద్విజః ,
వేదపాఠం తు విప్రాణాం , బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః . మహాభారతం.
సర్వజనములును జన్మచే శూద్రులుగనే పుట్టి , కర్మలచే ద్విజత్వము నొందుచున్నారు . వారిలో కొందరు వేదాధ్యయనముచే విప్రులయి బ్రహ్మజ్ఞానమును పొంది బ్రాహ్మణులైరి .
బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం ఇక్కడ విస్పష్టంగా చెప్పబడింది. ఈ మార్గాన్నే మనమందరం అనుష్టించాల్సి ఉంది.

1 comments:
చక్కనైన విషయం చెప్పారు అండి. పూర్తిగా బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకునే శక్తి ఈ కలియుగంలో మానవమాత్రులకు ఉండదు కాబట్టి కనీసం మంచిమనుషులుగా ఉండటం అవసరం.
Post a Comment