యస్యాస్తి విత్తం స నరః కులీనః

April 13, 2009

శ్లోII
యస్యాస్తి విత్తం స నరః కులీనః
స పణ్డితస్స శ్రుతివాన్ గుణజ్ఞః,
స ఏవ వక్తా సచ దర్శనీయః
సర్వే గుణాః కాంఞ్చన మాశ్రయన్తి.౩౨II
క.
ఏ నరునకు విత్తము గల
దానరుఁడు కులీనుఁ డధికుఁ డార్యుఁ డతండే
ధీనిధి ధన్యుఁడు నేర్పరి
నానా గుణములును కాంచనంబున నిలుచున్.

ఎవనికి ధనముగలదో వాడే గొప్ప కులమువాడు, గొప్పవాడు, బుద్ధిశాలి, కృతార్థుడు, నిపుణుడు. కాన అన్ని గుణములును బంగారము నందే యుండును.

అందుకే అంటారు మనవాళ్ళు. "డబ్బు లేనివాడు డుబ్బుకు కొఱగాడు" అని.

0 comments: