పాపా న్నివారయతి యోజయతే హితాయ

April 14, 2009

శ్లో
పాపా న్నివారయతి యోజయతే హితాయ
గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి,
ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే
సన్మిత్రలక్షణ మిదం ప్రవదన్తి సన్తః ౬౫
తే.
అఘమువలన మరల్చు, హితార్థకలితుఁ
జేయు, గోప్యంబు దాఁచుఁ, బోషించు గుణము,
విడువఁ డాపన్ను, లేవడి వేళ నిచ్చు;
మిత్రుఁ డీ లక్షణంబుల మెలగుచుండు.

పాపము నుండి త్రిప్పును; హితమైన కార్యముల గూర్చును; రహస్యమును దాచును; గుణమును పోషించును; ఆపద నున్నవాని వదలడు; దారిద్ర్యమున నిచ్చును; మిత్రుడీ లక్షణములతో నొప్పుచుండును.

0 comments: