April 12, 2009
శ్లోII
దానం భోగో నాశస్తిస్రో గతయో భవన్తి విత్తస్య,
యన్న దదాతి న భుఙ్క్తే తస్య తృతీయా గతిర్భవతి.II ౩౪
క.
దానము భోగము నాశము
పూనికతో మూఁడుగతులు భువి ధనమునకున్,
దానము భోగము నెఱుఁగని
దీనుని ధనమునకు గతి తృతీయమె పొసఁగున్.
లోకములో ధనమునకు దానము(ఈవి), భోగము(అనుభవించుట), నాశము నని మూడు మార్గములు గలవు. ఈవి అనుభవములు లేని నీచుని ధనమునకు మూడవ(నశించు) మార్గమే గతి యగును.
ధనాన్ని ఏ యే రకాలుగా ఉపయోగించ వచ్చో చెబుతూ మొదటి రెండు విధాలుగా ఉపయోగించకపోతే నాశనమే గతి అవుతుందని హెచ్చరిక చేస్తున్నారు. అందుచేత ధనాన్ని సంపాదించటం మాత్రమే కాదు , దానిని సరియైన పద్ధతిలో వినియోగించటం కూడా ముఖ్యమే.
0 comments:
Post a Comment