క్షాన్తి శ్చేత్కవచేన కిం కిమరిభిః క్రోధో2స్తి చేద్దేహినాం

April 15, 2009

శ్లోii
క్షాన్తి శ్చేత్కవచేన కిం కిమరిభిః క్రోధో2స్తి చేద్దేహినాం
జ్ఞాతి శ్చేదన లేన కిం యది సుహృద్ధివ్యౌషధైః కిం ఫలం
కిం సర్పైర్యది దుర్జనాః కిము ధనైర్విద్యా2నవద్యా యది
వ్రీడా చేత్కిము భూషణై స్సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్.౧౭ ii
చ.
క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి
త్రము దగుమందు, దుర్జనులు దారుణపన్నగముల్, సువిద్య వి
త్త ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్యమీ క్షమా
ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టునఁ దత్కవచాదు లేటికిన్.

ఓర్పు బొందళము(అంగి), కోపము శత్రువు, దాయాది అగ్ని, స్నేహితుడు తగిన యౌషధము, దుర్మార్గులు క్రూర సర్పములు, మంచి చదువు ధనము, తగిన సిగ్గు(మానము) అలంకారము, చక్కని కవిత రాజ్యము, ఈ క్షమ మున్నగునవి (మొదటివి) యున్నచో కవచము(రెండవది) మున్నగునవి యుండ నవసరము లేదు.
క్రమాలంకారముతో చెప్పిన శ్లోకమిది.

0 comments: