భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం,

April 11, 2009

శ్లో!!
భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం,
మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయమ్,
శాస్త్రే వాద భయం, గుణే ఖల భయం, కాయే కృతాన్తాద్భయం,
సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమే వాభయమ్.!!
చ.
బలగుణరూపభోగకులభర్మకళేబర శాస్త్రమానముల్
బలిఖలరుగ్జరాచ్యుతి నృపాలయమ ప్రతివాదిదైన్యసం
కులభయయుక్తముల్ నరులకున్ భువి నెవ్వియు నిర్భయంబులై
నెలకొన వెన్ని భంగులను నిర్భయ మొక్క విరాగమే సుమీ.

బలమునకు- బలవంతుడు, గుణములకు- దుష్టుడు, రూపమునకు- రోగము, భోగమునకు-ముసలితనము, కులమునకు-భ్రష్టత్వము, బంగారమునకు-రాజు, శరీరమునకు -యముడు, శాస్త్రమునకు-ప్రతివాది, మానమునకు-నీచము అనురీతి మనుజులకు భయమును కల్గించును. లోకములో భయము లేని వస్తువులే లేవు. భయము లేని దొక్క వైరాగ్యమే సుమా!

వైరాగ్య భావన యొక్క గొప్పదనం ఎంత బాగా వర్ణించారో చిత్తగించండి.

0 comments: