దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే

February 23, 2009

శ్లో!!
దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే!
ప్రీతిః సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవం!
శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాన్తాజనే ధృష్టతా!
యే చైవం పురుషాః కలాసు కుశలా స్తేష్వేవ లోకస్థితిః!!

చ.
వరకృప భృత్యులందు, నిజవర్గమునం దనుకూలవృత్తి, కా
పురుషులయందు శాఠ్యము, సుబుద్ధులయం దనురక్తి,తాల్మి స
ద్గురువులయందు, గౌరవము కోవిదులందు, నయంబు రాజులం,
దరిజనులందు శౌర్యము, మగాక్షులయందుఁ బ్రగల్భభావ మీ
వరుసఁ గళా ప్రవీణులగువారలయందు వసించు లోకముల్.
తా.
సేవకులయందు దయయు, తమవారియం దనుకూలముగ నుండుటయు, కుత్సితులయందు కపటత్వమును, మంచివారియం దాసక్తియును, గురువుల యందు క్షమయును, పండితులయందు గౌరవమును, రాజులయందు న్యాయమును, శత్రువులయందు పరాక్రమమును, స్త్రీలయందు సామర్థ్యమును- ఈ విధముగ విద్యాధికుల విషయమున జనులు ప్రవర్తింతురు.

0 comments: