February 24, 2009
మూర్ఖ పద్ధతి
శ్లో
బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః
అబోధోపహతాశ్చాన్యే జీర్ణ మఙ్గే సుభాషితమ్.
తే.
బోద్ధలగువారు మత్సర పూర్ణమతులు
ప్రబలగర్వవిదూషితుల్ ప్రభువులెన్న
నితర మనుజు లబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.
తెలిసినవారు ఈర్ష్యులుగ నున్నారు.ప్రభువులన్నచో మిక్కిలి గర్వముతో నున్నారు. వీరికంటే ఇతరులు తెలియక యున్నారు. కాన నా సుభాషితము (మంచి వాక్కు) తలంపుననే లయమయ్యెను.
ఇది భర్తృహరి సుభాషిత రత్నావళి లోని నీతి శతకం లోని మొదటి శ్లోకము.
0 comments:
Post a Comment