మాంధాతా చ మహీపతిః

January 30, 2009

శ్లో!!
మాంధాతా చ మహీపతిః కృతయుగాలంకారభూతో గతః!
సేతుర్యేన మహోదధౌ విరచితః క్వా2సౌ దశాస్యాంతకః!
అన్యే చా2పి యుధిష్టర ప్రభృతయో యాతా దివం భూపతే!
నై కేనా2పి సమంగతా వసుమతీ నూనం త్వయా యాస్యతి!! భోజచరితమ్

"ఓ రాజా! కృతయుగమునకు అలంకారమైన మాంధాత చక్రవర్తి వెళ్ళిపోయినాడు; సముద్రమునకు సేతువు నిర్మించినట్టి మహా పురుషుడు రావణసంహారకుడు శ్రీరామచంద్రుడు మాత్రం ఉన్నాడా! ఇక ధర్మరాజు మొదలైన మహాత్ములు ఎందరెందరో చక్రవర్తులున్నూ స్వర్గమునకు వెళ్ళిపోయిరి గదా, వీరిలో ఏ ఒక్కరితోనూ యీ వసుమతి కూడ వెళ్ళలేదు గాని నీతో మాత్రం తప్పకుండా వచ్చేటట్లున్నది!" అని భోజుడు తనను చంపబనిచిన పినతండ్రి ముంజుని ఉపాలంభన గావించిన సందర్భము.

రాజశేఖరా!రామలింగరాజా! మీ యిద్దరితో కూడా చూడబోతే యీ వసుమతి అక్కడిక్కూడా వచ్చేట్టుంది.అవునా!

0 comments: