అహింసా ప్రథమం పుష్పం

January 26, 2009

బ్లాగ్మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
శ్లో!!
అహింసా ప్రథమం పుష్పం! పుష్ప మింద్రియనిగ్రహః!
సర్వభూతదయా పుష్పం! క్షమా పుష్పం విశేషతః!
శాంతిపుష్పం తపః పుష్పం! ద్యానపుష్పం తధైవచ!
సత్య మష్టవిధం పుష్పం! విష్ణోః ప్రీతికరం భవేత్!!

విష్ణుదేవునికి అత్యంత ప్రియమైన పువ్వు లెనిమిదింటిని చెపుతాను. మరే పువ్వులకంటె వీటితో పూజించిన ఆయన సంప్రీతుడగును. అహింసా, ఇంద్రియనిగ్రహము, జీవదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము అనునవే ఆ ఎనిమిది పువ్వులున్నూ.

అందుకని మనం ఎల్లప్పుడూ ఈ ఎనిమిది గుణాల్నీ అలవరచుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం.

0 comments: