అంబాకుప్యతితాతమూర్ధ్ని విలసద్గంగేయ ముత్సృజ్యతాం

January 15, 2009

శ్లో!!
అంబాకుప్యతితాతమూర్ధ్ని విలసద్గంగేయ ముత్సృజ్యతాం!
విద్వన్ షణ్ముఖ కాగతిః మయిచిరా దస్యాస్థితాయా వద!
కోపావేశవశా దశేషవదనైః ప్రత్యుత్తరం ద త్తవాన్!
అంబోధిః జలధిః పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధిః!!


"ఓ తండ్రీ! అమ్మ కోపిస్తూంది.నీ తలపైనున్న ఆ గంగను విడువుమా!"అన్నాడు కుమారస్వామి.'ఓ షణ్ముఖా!చిరకాలంగా నన్నాశ్రయించుకున్న ఆమెకి గతియేదిరా?'అని ఈశ్వరుడు జవాబివ్వటంతో కోపావేశవశుడైన కుమారుని ఆరు ముఖాలనుంచీ యీ విధంగా జవాబు వచ్చింది.'అంబోధిః జలధిః పయోధిః ఉదధిః వారాంనిధిః వారిధిః' అనగా గంగకు సముద్రమే గతి యన్నాడని అర్థము.

ఎంత గమ్మత్తైన శ్లోకం!

1 comments:

రాఘవ said...

వ్రాసినవారెవరో కానీ భలే చమత్కారంగా వ్రాసారండీ!