న స్నానేన న మౌనేన

January 1, 2009

శ్లో!!
న స్నానేన న మౌనేన!
నైవాగ్ని పరిచర్యయా!
బ్రహ్మచారీ దివం యాతి!
సయాతి గురుపూజనాత్!! --శంఖస్మృతి

స్నానాది శౌచక్రియలచేత గాని, మౌనము మొదలైన నియమములవల్ల గాని, అగ్నిహోత్రాది కర్మలవల్ల గాని, బ్రహ్మచారి అనగా విద్యార్థి, స్వర్గమును పొందుటలేదు గాని గురుపూజ ద్వారానే మంచిగతులను పొందుతున్నాడు.

విద్యార్థికి గురుపూజయే అన్నిటికంటే ముఖ్యమయినది.దానివలన అతనికి సర్వమూ సిద్ధిస్తుంది.గురువు సంతోషపడితే అన్నివిద్యలూ శిష్యునికి నేర్పడం జరుగుతుంది.

1 comments:

Disp Name said...

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు