న సా సభా యత్ర న సంతి వృద్ధాః

January 4, 2009

శ్లో!!
న సా సభా యత్ర న సంతి వృద్ధాః!
న తే వృద్ధా యే న వదంతి ధర్మం!
నాసౌ ధర్మో న సత్యమస్తి!
న తత్సత్యం యచ్ఛ తేనాభ్యుపేతం!!


ఎక్కడ వృద్ధులు లేరో అది సభ కాజాలదు;ఎవరు ధర్మమును చెప్పరో వారు వృద్ధులు గారు;దేనియందు సత్యము లేదో అది ధర్మము గాదు;దేనివల్ల లోకమునకు కల్యాణ మొనగూడదో అది సత్యము గాజాలదు. అనగా లోకకల్యాణ మొనగూర్చు సత్యధర్మ ప్రవచన మొనర్చు పండితులు కూర్చున్నదే సభ యని అర్థము.

1 comments:

మాలతి said...

మంచి సూక్తులు పరిచయం చేస్తున్నారు. అభినందనలు.