సంతు విలోకన భాషణ

December 6, 2008

శ్లో!!
సంతు విలోకన భాషణ!
విలాస పరిహాస కేళి పరిరంభాః!
స్మరణ మపి కామినీనాం!
అల మిహ మనసోవికారాయ!! ప్రబోధచంద్రోదయం


కామినులను చూడటం, మాట్లాడటం, విలాసపరిహాసములు చేయడం, కేళీపరిరంభాదు లొనర్చడం మాట యటుంచుడు. కేవలమూ వారి స్మరణమాత్రముననే మనస్సు అనేకవికారములకు లోనవుతూ ఉంది, అటువంటపుడు యిక మిగిలిన సందర్భాలలో స్త్రీలకు దాసులగుట గాక మరేమున్నది?

తస్సదియ్యా!దీన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో తెలిసి చావటం లేదే!

1 comments:

subramanyam K.V. said...

నరసింహ గారు, మరొ మంచి శ్లొకాన్ని అందించినందుకు ధన్యవాదములు

దాదాపుగా ఇలాంటిదే వేమనపద్యం


ఎర్రనాడుదాని ఏపార జూచిన
నేకి బుట్టు చాల వెర్రి బుట్టు
పళ్ళు తెరిచి నగిన పట్టు పెంభూతంబు
విశ్వదాభిరామ వినురవేమ

మన కవులు ఆ కాలం లో కాంతా,కనకాల వ్యామోహం నుండి బయటపడదామని పొరడిన వారు కావటం చేతేనేమో మనకి ఇంత చక్కటి నీతుల్ని బొధించ గలిగారు