సమ్మోహయంతి మదయంతి విడంబయంతి

December 6, 2008

శ్లో!!
సమ్మోహయంతి మదయంతి విడంబయంతి!
నిర్భర్త్సయంతి రమయంతి విషాదయంతి!
ఏతాః ప్రవిశ్య సదయం హృదయం నరాణాం!
కిం నామ వామనయనా న సమాచరంతి!! ప్రబోధచంద్రోదయం

నరుల సదయహృదములయందు చొఱబారి నారీమణులు ఏమి చేసినా చేస్తున్నారు గదా, సమ్మోహింప జేస్తున్నారు, మత్తు కలిగిస్తున్నారు, భ్రమింప జేస్తున్నారు, బెదరిస్తున్నారు, ఆనందింప జేస్తున్నారు, దుఃఖం కలిగిస్తున్నారు, ఒకటేమిటి? ఇంకా ఎన్నో..

ఎందుకో తెలియదు కాని 'వామనయన' అనే పదం నాకెంతో ఇష్టమయిన పదాల్లో ఒకటి.

0 comments: