మన ఏవ మనుష్యాణాం

December 4, 2008

శ్లో!!
మన ఏవ మనుష్యాణాం!
కారణం బంధమోక్షయోః!
బంధాయ విషయాసంగి!
ముక్త్యై నిర్వషయం స్మృతమ్!! మైత్ర్యుపనిషత్ 6-30


మనస్సే బంధమోక్షములు రెంటికీ కారణ మగుచున్నది.మనస్సు విషయాసక్త మగుచో బంధనమునకును,నిర్విషయ మగుచో ముక్తికిని కారణ మగుచున్నది.

మనో నిగ్రహం యొక్క ఆవశ్యకతను గురించి మరో రెండు మాటలు.విషయములయందు(ఇంద్రియార్థములయందు) ఆసక్తిని కలిగి ఉంటే బంధనమనిన్నీ,అట్టి ఆసక్తిని నిగ్రహిస్తే మోక్షమనిన్నీ చెప్పబడింది.అందుచేత నిషయాసక్తిని విడిచిపెట్టే ప్రయత్నం మొదలుపెడదాం.

0 comments: