విద్యా దదాతి వినయం

December 4, 2008

శ్లో!!
విద్యా దదాతి వినయం!
వినయాద్యాతి పాత్రతాం!
పాత్రత్వా ద్ధన మాప్నోతి!
ధనా ద్ధర్మం తత స్సుఖం!! హితోపదేశం


విద్య యొసగును వినయంబు
వినయంబునను బడయు పాత్రత
పాత్రత వలని ధనంబు దానివలన
ఐహికా ముష్మిక సుఖంబు లందు నరుడు.

విద్య వలన వినయమును, దానివల్ల పాత్రతను, అందుమూలమున ధనమును,ధనము వలన సుఖమును నరులు పొందుతారు.

అందుకేనేమో 'విద్య నెఱుంగనివాడు మర్త్యుడే' అంటాడు భర్తృహరి.

0 comments: