మన ఏవ జగత్సర్వం

December 4, 2008

శ్లో!!
మన ఏవ జగత్సర్వం!
మన ఏవ మహ రిపుః!
మన ఏవ హి సంసారో!
మన ఏవ జగత్త్రయమ్!! ఋభుగీత 2-34

ఈ మనస్సే సర్వజగత్తున్నూ; మనసే పరమశత్రువు; అదియే సంసారహేతువు; అదే మూడు లోకములూ కూడను అగుచున్నది. మనస్సును స్వాధీనము గావించుకొనుచో జగములన్నీ స్వాధీనమై ఉండును.

మనోనిగ్రహం ఉంటే సాధించలేనిది ఏదీలేదన్నమాట.ఎంత సాధన చేసి అయినా మనస్సును నిగ్రహించే ప్రయత్నం మనమందరం చేద్దామా?
ఈ ఋభుగీత అనేదాన్ని ఎవరు ఎవరికి బోధించారో ఎవరైనా తెలిసినవారు తెలియజేస్తే బాగుంటుందనిపిస్తుంది.

3 comments:

Subramanyam K.V. said...

నేను విన్నంత వరకు ఋభువు బ్రహ్మ మానసపుత్రులలో ఒకడు .ఈ యనకి నిదాభుడనే శిష్యుడు ఉండేవాడు.నిదాభుడిని ఋభువు ఉద్ధరించిన కధ ఒకటి దత్తాత్రేయ చరిత్ర లో ఉంటుంది.ఋభు గీత లో కూడ ఈ గురుశిష్య సంవాదం ఉంది .నాకు సంస్కృతమందు అంత పట్టు లేదు కావున అంత సాధికారం గా చెప్పలేను కాని ఋభు గీత ఈ గురుశిష్యుల సంవాదమేనన్నది నా నమ్మకం .


http://www.khapre.in/portal/url/sa/sahitya/geeta/rubhu/z80601211924(%E0%A4%8B%E0%A4%AD%E0%A5%81.%E0%A4%97%E0%A5%80%E0%A4%A4%E0%A4%BE.%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%A5%E0%A4%AE%E0%A5%8B%E0%A4%BD%E0%A4%A7%E0%A5%8D%E0%A4%AF%E0%A4%BE%E0%A4%AF%E0%A4%83).aspx

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) said...

ధన్యవాదాలండీ . సూక్తి ముక్తావళి పుస్తకం నా దగ్గరనుంచి పోవటం చేత ఇంతకాలం కొత్త పోస్టులను పోస్టు చేయలేదు. మొన్ననే భాగ్యనగరానికి వెళ్ళినపుడు విశాలాంధ్రలో సూక్తి ముక్తావళి దొరికితే తీసుకున్నాను. మళ్ళీ కొత్త పోస్టులు వ్రాయటానికి ప్రారంభిస్తాను. ఋభుగీత దేవనాగరి లిపిలో ఉన్నది. తెలుగు లిపిలో అన్నది డొరికితే తేలికగా చదవ్వచ్చును.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) said...

ఉన్నది