నరత్వం దుర్లభం లోకే

December 4, 2008

శ్లో!!
నరత్వం దుర్లభం లోకే!
విద్యా తత్ర సుదుర్లభా!
కవిత్వం దుర్లభం తత్ర!
శక్తి స్తత్రసుదుర్లభా!! అగ్ని పురాణం

లోకములో మనుష్యజన్మ యెత్తడమే దుర్లభమైనది; అందులోనూ విద్యాసంపాదన చేయగలుగుట మరింత దుర్లభము,చదువు వచ్చినను కవిత్వము పట్టుబడుట మరీ కష్టము,కవి కాగలిగినను అందులో వ్యుత్పత్తిశక్తి కలుగువాడగుట అసలే కష్టము గదా.

ఒకదానిని మించి మరొకటి ఇంకా ఇంకా కష్టంగా వుంటున్నాయి.అయినా సరే,"సాధనమున పనులు సమకూరు ధరలోన"-అన్నారు.కాబట్టి పట్టువదలకుండా సాధన చేద్దాం మనమందరం.

0 comments: