అసంతుష్టో ద్విజో నష్టః

December 6, 2008

శ్లో!!
అసంతుష్టో ద్విజో నష్టః!
సంతుష్ట ఇవ పార్థివః!
సలజ్జా గణికా నష్టా!
నిర్లజ్జేవ కులాంగనా!! హితోపదేశం

సంతుష్టి లేని బ్రాహ్మణుడు, సంతుష్టుడైన రాజు పాడగుదురు.బ్రాహ్మణునికి లభించిన దానితో తృప్తి ఉండవలె.కాని రాజులకు ఉన్న రాజ్యముతో తృప్తిగలిగిన,ప్రక్కవాడు పెరిగి వీని నాక్రమించును.కులస్త్రీకి లజ్జ కలిగియుండుట యోగ్యత,కాని వెలయాలు సిగ్గరియైన చెడిపోవును. ఒకరికి మంచిదైనది అందరికీ మంచిది కాజాలదని భావన.

ఎవరికి ఏది మంచిదో,ఏది ఉపయోగకరమో దానినే వారు ఆచరించాలి.అన్నీ అందరికి ఒకేరకంగా ఉపయోగపడవు.

0 comments: