ఆహార నిద్రా భయ మైథునాని

December 3, 2008

శ్లో!!
ఆహార నిద్రా భయ మైథునాని!
సామాన్య మేతత్పశుభి ర్నరాణాం!
జ్ఞానం పి తేషా మధికో విశేషో!
జ్ఞానేన హీనాః పశుభి స్సమానాః!! ఉత్తర గీత 2-44


ఆహార,నిద్రా,భయ,మైథునములు, నాలుగును ప్రాణి ధర్మములు. ఇవి జంతుకోటికి,మానవులకు సమానములే,ఇక విశేష మేమిటంటే మానవులకు జ్ఞానమనే దొక్కటే అధికము. జ్ఞానములేని మానవులు పశువులతో సమానులే కాని భిన్నులు గారు.

అందుచేత,మనమందరం మన ప్రత్యేకతని గుర్తులో ఉంచుకొని మన జ్ఞాన సంపదని నానాటికి వృద్ధి చేసుకుంటూ దానిని సక్రమ మార్గంలో వినియోగిస్తూ మానవాళి కంతటికీ శుభాన్ని కలిగిద్దాం.సరేనా?

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య సంకీర్తనామృతము డా.సముద్రాల లక్ష్మణయ్య ఎం.ఏ గారి వ్యాఖ్యతో ప్రథమ ద్వితీయ భాగములు కలిపి ఒకే పుస్తకంగా విడుదలైంది చూశారా!

Unknown said...

చూడలేదండి.ఈ సారి విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్ కి వెళ్ళినపుడు చూస్తాను.