అసారే ఖలు సంసారే సారం శ్వశుర మందిరం

November 26, 2008

శ్లో
అసారే ఖలు సంసారే
సారం శ్వశుర మందిరం
హిమాలయే హర శ్శేతే
హరి శ్శేత మహాదధౌ।

సారహీనమైన ఈ సంసారమందు అత్తవారిల్లు ఒక్కటే కొంత సారం గలదిగా ఉంటూంది।అందువల్లనేగదా పరమేశ్వరు డంత వాడు అత్తవారిల్లయిన హిమాలయంమీది కైలాసమున నివసించుట; అంతేవా; సాక్షాత్ విష్ణుమూర్తి కూడా అత్తవారిల్లు అయిన పాల సముద్రం లోనే పండుకొవి వుంటున్నాడు గదా.

0 comments: