న జాతు కామః కామానాం

December 3, 2008

శ్లో!!
న జాతు కామః కామానాం!
ఉపభోగేన శామ్యతి!
హవిషా కృష్ణవర్త్మేవ!
భూయ ఏవా2భివర్థతే!! మనుస్మృతి 2-94


కోరికలు ఎన్నటికిని అనుభవించుటచేత ఉపశమించవు. నేయి పోసిన కొలదిన్నీ అగ్ని ప్రజ్వరిల్లునట్లు, అనుభవించిన కొలదిన్నీ విషయములయందు కోరిక ననలు సాగుచునే యుండును. గనుకనే అనుభవమును నిషేధించకనే కోరికలు త్రుంచివేసుకొనమనే మనవారు బోధించిరి.

కోరికలను ఎంత బాగా నియంత్రణలో ఉంచుకోగలిగితే ప్రాణానికి అంత సుఖంగా ఉంటుంది.అందుచేత ఆ దిశగా మన ప్రయత్నాలను వేగనంతం చేద్దాం.

0 comments: