కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాన్తI

November 5, 2008

శ్లోII
కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాన్తI
మద్వైవ మే విశతు మానసరాజహంసఃI
ప్రాణప్రయాణసమయే కఫవాత పిత్తైఃI
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తేII
-- ముకుందమాల

ఓ కృష్ణా!నా మనస్సనెడి రాజహంస యిపుడే నీపాదపద్మములనెడి పంజరమును ప్రవేశించుగాక. ఎప్పుడో ఆఖరిదశయందు నీనామస్మరణ చేయుదమనుకొనుట భ్రమగదా!ఏలనన మరణసమయమందు కఫవాతపిత్తములచే గొంతు నిరోధించబడి యున్నపుడు నిన్ను స్మరించుట యెట్లు సాధ్యమగును?
అంతే కాదు, ప్రాణప్రయాణ సమయం అందరకూ ముందుగా తెలియదు కదా!అందుచేత ఇప్పుడే ఈ క్షణమందే నా మనస్సును నీయందు లగ్నమయ్యేలా చేయి ప్రభూ!

0 comments: