దీపనిర్వాణగంధం చ

November 5, 2008

శ్లో!!
దీపనిర్వాణగంధం చ!
సుహృద్వాక్య మరుంధతీం!
న జిఘ్రంతి న శృణ్వంతి!
న పశ్యంతి గతాయుషః!! నారాయణపండితరచితః హితోపదేశం (ప్రథమ భాగం)49-77


చావు మూడినవారు దీపనిర్వాణగంధమును పసికట్టరు,మిత్రవాక్యమును చెవిపెట్టరు,అరుంధతీ నక్షత్రమును కనజాలరు అని పెద్దలు చెప్పుదురు.

8 comments:

సుజాత said...

దీన్ని పంచతంత్రంలో కూడా చదివినట్టు గుర్తు....పోగాలం దాపురించిన వారు మిత్ర వాక్యమును, అరుంధతిని, దీపనిర్వాణ గంధమును వినరు కనరు మూర్కొనరు..అని! అలాగే తెలుగు వ్యాకరణం క్లాసులో కూడా క్రమాలంకారం నేర్చుకునేటపుడు ఈ ఉదాహరణ తప్పక నేర్చుకోవాల్సిందే!

నరసింహ said...

పంచతంత్రం లో కూడా ఉండొచ్చు.చూసి చెబుతాను.

బొల్లోజు బాబా said...

దీపనిర్వాణ గంధము అంటే ఏమిటండీ

నరసింహ said...

నూనె దీపమును ఆర్పివేసిన తర్వాత వచ్చే వాసన.

బొల్లోజు బాబా said...

అవునాండీ. థాంక్యూ.

netizen నెటిజన్ said...

ఇది పంచతంత్రంలొనిది, ఎప్పుడో రెండవ తర్గతిలోనొ, మూడవ తరగతిలోనో చదువుకున్న జ్ఞాపకం!

అలాగే, "నఖ, శిఖ, దంతములు స్థానభ్రంశము పొందినేని రాణింపవు".

దీనినే మరో విధంగా..ఎవరన్నా పూరించండి!

భస్మాసుర said...

Wonderful!!

Some greek quote comes to mind after reading this..

"Those whom god wishes to destroy, he first deprives of their senses"

నరసింహ said...

హితోపదేశంలో ఉన్నది పేజీ సంఖ్య,శ్లోక సంఖ్య కూడా ఇచ్చాను.పంచతంత్రం లో నా దగ్గరున్న సంస్కృత భాషా ప్రచార సమితి వారి పుస్తకంలో శ్లోకాల వరుస క్రమం ఇవ్వలేదు.అందుచేత వెదకటానికి టైము పడుతుంది.