ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే

November 9, 2008

శ్లో!!
ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే!
నారీ గృహద్వారి జనాః శ్మశానే!
దేహ శ్చితాయాం పరలోకమార్గే!
ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః!!

ధనమును భూమియందును, పశ్వాదులను సాలలయందును,భార్యను యింటి గుమ్మం లోనూ, జనులను శ్మశానమందును, దేహమును చితి యందును వదలిపెట్టి జీవుడు ఏకాకియై పరలోక మార్గమున పోవునపుడు ధర్మ మొక్కటే అతనితో గూడ పోతూన్నది.
ఇదొక్కటి గుర్తుంచుకుంటే చాలు,చాలావరకూ మనుష్యులు పాపాలు చేయకుండా జీవించగలగటానికి.

2 comments:

యామజాల సుధాకర్ said...

చాలా మంచి సూక్తులను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. వీలైతే అవి ఎక్కడనుండి సంగ్రహించినవో చెప్పగలరు.

Unknown said...

సూక్తి ముక్తావళి పేరుతో మహీధర జగన్మోహన రావు గారి సంకలనం నుండి ఎత్తి వ్రాస్తున్నాను.ఆ విషయం మొట్టమొదటి పోస్టులోనే తెలియజేసాను(old posts) చూడండి.