కళారత్నం గీతం శ్రవణసుఖరత్నం హరికథా

November 9, 2008

శ్లో!!
కళారత్నం గీతం శ్రవణసుఖరత్నం హరికథా!
రణే రత్నం వాజీ గగనతలరత్నం దినకరః!
నిశారత్నం చంద్రః శయనరత్నం శశిముఖీ!
సభారత్నం విద్వాన్ నృపతికులరత్నం రఘుపతిః!!

పాట కళలలో రత్నం వంటిది; చెవులకింపు కలిగించువాటిలో హరికథ ఉత్తమము; యుద్ధంలో గుఱ్ఱమే పరమోపయుక్తమైనది; ఆకాశానికి శోభ సూర్యభగవానుడే; రేయికి రాజు చంద్రుడే; పడకటింటికి రాణి చంద్రవదనయే; విద్వాంసుడే సభకు వెలుగు; ప్రభువులలోకెల్ల రాముడే ఎన్నదగినవాడు.

"రత్నం" అనే మాటని పలుమార్లు ఉపయోగిస్తూ చెప్పిన అందమైన శ్లోకం ఇది.అందుచేత ఈ శ్లోకం కూడా శ్లోకాల్లో రత్నం లాంటిది అని అనుకుందాం.సరిపోతుంది.

0 comments: