అర్థాః పారదసన్నిభాః

November 11, 2008

శ్లో!!
అర్థాః పారదసన్నిభాః గిరినదీవేగోపమం యౌవనం!
మానుష్యం జలబిందులోల చపలం ఫేనోపమం జీవనం!
ధర్మం యో న కరోతి నిశ్చలమతిః స్వర్గార్గళోద్ఘాటనం!
పశ్చాత్తాపహతో జరాపరిణతః శోకాగ్నినా దహ్యతే!!


సంపదలు అస్థిరములు; యౌననము సెలయేటివలె అతిశీఘ్రముగా గడిచి పోవునది; మానవ జన్మమే మరల కలుగుననుటకు వీలులేదు; జీవికయే అసలు నీటిబుడగ వంటిది. ఇన్ని విషయములూ గమనించక, మూఢుడై స్వర్గద్వారములను తెరిపించు ఏకైక సాధనమైన ధర్మాచరణమును ఎవడు నిశ్చల బుద్ధితో చేయడో వాడు ముసలివాడై శక్తి ఉడిగిన తర్వాత పశ్చాత్తాపహతుడై, శోకాగ్ని చేత దహించబడి పోతూంటాడు.

అందుచేత వయసుడుగక మునుపే ధర్మాచరణమునకు మనమందరం పూనుకుందాం.రండి.కాలహరణం చేయకండి.-అనే ప్రబోధం.

0 comments: