సత్యం మాతా పితా జ్ఞానం

November 11, 2008

శ్లో
సత్యం మాతా పితా జ్ఞానం
ధర్మో భ్రాతా దయా సఖా
శాంతిః పత్నీ క్షమా పుత్రః
షడేతే మమ బాంధవాః


మంII
సత్యాన్నాస్తి పరో ధర్మఃI సత్యం జ్ఞానమనంతం బ్రహ్మI
సత్యేన వాయురావాతిI సత్యే నాదిత్యో రోచతేI
దివిసత్యం వాచః ప్రతిష్ఠాI సత్యే సర్వం ప్రతిష్ఠితంI
తస్మాత్సత్యం పరమం వదంతిI సత్యం పరం వరం సత్యంI
సత్యేన న సువర్గా ల్లోకాత్I చ్యవంతే కదాచనI
సతాగ్ంహి హి సత్యంI తస్మా త్సత్యే రమంతేII

సత్యమును మించిన ధర్మము లేదు,సత్యమే జ్ఞానము,అనంతము నైన బ్రహ్మస్వరూపము,సత్యము వలననే వాయువు వీచుచున్నది. సత్యము వలననే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.సత్యమువల్లనే వాక్కు శాశ్వతమవుతూంది. సత్యమందే సర్వ జగత్తును సుప్రతిష్ఠమై వున్నది.కావున సత్యమే సర్వశ్రేయంబైన ధర్మము.సత్యమే ఉత్కృష్టము.శ్రేష్ఠమైనదీ సత్యమే.సత్యము వల్లనే స్వర్గాదులనుండి మానవులు యెన్నడూ చ్యుతులు గాకుందురు.సత్యమే శశ్వతము.అందుచేతనే మహాత్ములు సత్యమునందే రమించుచున్నారు.

ఇటువంటి మంచి మాటలు మాటిమాటికి వింటుండటం,చదువుకోవటం,ధారణ చెయ్యటం,అధ్యయనం చేయటం--మనందరికీ ఎంతో శ్రేయోదాయకం.అసత్యం మీద సత్యాని కెప్పుడూ గెలుపే.అందుచేత మనం మాట్లాడేటప్పుడు ఈ విషయం సర్వదా అందరూ గుర్తుంచుకుంటారని ఆశిస్తూ---

2 comments:

Kottapali said...

మంచి శ్లోకాలు, అర్ధంతో సహా రాస్తున్నారు. జనాలకి ఉపయోగపడుతుంది.

Unknown said...

మీ వంటి పెద్దల ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తిని కలుగజేస్తుంది.ధన్యవాదములు.మారుతున్న కాలానికి ఎప్పుడూ మారకుండా వుంటున్న విలువలను గురించి తెలియజేయాలనే నా తాపత్రయమంతా.