కేయూరాణి న భూషయన్తి పురుషం

November 5, 2008

శ్లో!!
కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా!
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః!
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే!
క్షీయన్తే2ఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్!! భర్తృహరి


భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగదతారహారముల్,
భూషితకేశపాశమృదుపుష్పసుగంధజలాభిషేకముల్
భూషలు గావు, పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్. ఏనుగు లక్ష్మణకవి

మనుజులకు బంగారు భుజకీర్తులు,ముత్యాలహారములును అలంకారములు కావు.అలంకరించుకొన్న వెండ్రుకలు మెత్తని పూవులు పరిమళజలస్నానములును అలంకారములు కావు.పవిత్రమైన వాక్కే పురుషుని అలంకరింపజేయును.వాక్కనెడి యాభరణమే మంచి యాభరణము.తక్కిన యాభరణము లన్నియు నశించును.

చిన్నప్పటి రోజుల్లో ఈ పాట రోజూ రేడియోలో వింటుండేవాళ్ళం.ఎంత శ్రవణశుభగంగా ఉండేదో.

4 comments:

సుజాత వేల్పూరి said...

అవును నరసింహ గారు,
ఆలిండియా రేడియో విజయవాడ లో సంస్కృత పరిచయం కార్యక్రమం ముందు, పూర్తయిన తరవాత ఈ శ్లోకాలు శ్రవణానందకరంగా ఉండేవి. బాగా గుర్తు చేసారు.

Bolloju Baba said...

నరసింహ గారు,
మంచి శ్లోకాన్ని గుర్తుచేసారండీ
మిత్రులారా ఈ శ్లోకం యొక్క ఆడియో మన నెట్టులో ఎక్కడైనా దొరుకుతుందా.

పరుచూరి శ్రీనివాస్ గారు ఎవరూ లింకులివ్వకపోతే, ఆ భారాన్నేదో మీరే భరించి, మా అందరికోసమై శ్రమించాలి సారూ. :-)

బొల్లోజు బాబా

Unknown said...

esnips లో దొరకలేదు.ఇంకెక్కడైనా దొరుకుతుందేమో
ెవరైనా చెప్పి పుణ్యం కట్టుకోరూ

మూర్తి మైదవోలు said...

మంచి శ్లోకం