ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచైః

November 18, 2008

శ్లో!!
ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచైః!
ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాః!
విఘ్నై ర్ముహుర్ముహు రపి ప్రతిహన్యమానాః!
ప్రారబ్థ ముత్తమగుణా పరిత్యజంతి!! భర్తృహరి-నీతి శతకం 73

శా.
ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
ఆరంభించి పరిత్యజింతు రురువిఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమాను లగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరుసుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్. ఏనుగు లక్ష్మణకవి

విఘ్న భయంతో ఏ పనినీ ఆరంభించని వారు అధములు; కార్యము నారంభించిన్నీ మధ్యలో విఘ్నము వస్తే ఆపివేసేవారు మధ్యములు; ఆరంభించిన కార్యములు ఎన్ని విఘ్నములు వచ్చినా వదలిపెట్టక,రెట్టించిన ఉత్సాహంతో వానిని పూర్తిగావించేవారు ఉత్తములు.

0 comments: