జన్మ ప్రభృతి యత్కించిత్

November 8, 2008

శ్లో!!
జన్మ ప్రభృతి యత్కించిత్!
చేతసా ధర్మ మాచరేత్!
సర్వంతు నిష్ఫలం యాతి!
ఏకహస్తాభివాదనాత్!! విష్ణు పురాణం


పుట్టినది మొదలుకొని గావించుతూ వచ్చిన ధర్మము ఏకొంచెమున్నను అదికూడా ఒక్కచేతితో పెద్దలకు అభివాదనము చేయుటవల్ల నశించిపోతుంది. ఎందువల్లనంటే ఏకహస్తాభివాదనమందు అవినయమే భాసిస్తుంటుంది.దానివల్ల సర్వధర్మములు నిష్ఫలమైపోతాయి.

ఆంగ్లేయుల సంస్కృతిని విడిచిపెట్టి తిరిగి మన సంస్కృతిని పూర్తిగా అలవాటు చేసుకోకపోవటం వల్ల వచ్చిపడిన దుస్థితి యిది.ఇప్పటికైనా మనమందరం అందరికీ రెండు చేతులూ ఉపయోగించి హృదయపూర్వకమైన నమస్కారాన్నే అందిద్దాము.

0 comments: