వైద్యరాజ నమస్తుభ్యం

November 8, 2008

శ్లోII
వైద్యరాజ నమస్తుభ్యంI
యమరాజ సహోదరI
యమస్తు హరతి ప్రాణాన్I
వైద్యః ప్రాణాన్ ధనానిచII కలివిడంబన శతకం


యమసహోదరుడవైన ఓ వైద్యరాజా! నీకు నమస్కారము.ఎందుకన, యముడు ప్రాణాలనే తీసుకుపోతాడు, వైద్యుడు ప్రాణాన్నీ, ధనాన్నీ కూడా హరిస్తాడు; గాన నాజోలికి రాకుండుటకే సుమా నీకు నమస్కారము.

వైద్యవృత్తిని,ప్రాణాలను కాపాడేదిగా కాక కేవలం 'ధనసంపాదన' కోసమే అనే దృష్టితో ఉంటున్న మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్సును గురించయితే మాత్రం ఇది పూర్తిగా నిజమనిపిస్తుంది.

0 comments: