భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః

November 12, 2008

శ్లో!!
భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః! ప్రాణినాం బుద్ధిజీవినః!
బుద్దిమత్సు నరాః శ్రేష్ఠాః! నరేషు బ్రాహ్మణాః స్మృతాః!
బ్రహ్మణేషు చ విద్వాంసో! విద్వత్సు కృత బుద్ధయః!
కృతబుద్దిషు కర్తారః! కర్తృషు బ్రహ్మవేదినః!! మనుస్మృతి

సమస్త భూతములలోనూ ప్రాణులే శ్రేష్ఠములు; ప్రాణులలో బుద్ధితో కూడినవి శ్రేష్ఠములు; బుద్దిగలవానిలో మానవులు శ్రేష్ఠులు; నరులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు; బ్రాహ్మణులలో విద్వాంసులు శ్రేష్ఠులు; వారిలో కృతబుద్ధులైనవారు శ్రేష్ఠులు; కృతబుద్ధులలో కర్తలు అనగా ఆచరణశీలురు శ్రేష్ఠులు; అట్టి కర్తలలో బ్రహ్మవేత్తలు శ్రేష్ఠులు.- అని మనువు చెప్పిరి.

మనకున్న స్మృతులలో అతిప్రాచీనమైనది మనుస్మృతి.ఇంకా యాజ్ఞ్యవల్క స్మృతి వగైరా చాలా చాలా ఉన్నాయి.కాలానుగుణంగా వచ్చే మార్పులతో అప్పుడు చెప్పినవాటిలో కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు మనకు రుచించక పోవచ్చు.కాని పాతవైనా ఇంకా ఇప్పుడు మనం వాటిని తెలుసుకోడానికి ఇష్టపడుతున్నాం అంటే వాటిలో ఉన్న సర్వకాలీనతే దానికి కారణం అనుకుంటాను.

0 comments: