దివసేనై వ తత్కుర్యాత్

November 6, 2008

శ్లోII
దివసేనై వ తత్కుర్యాత్ యేన రాత్రౌ సుఖం వసేత్!
అష్టమాసేన తత్కుర్యాత్ యేన వర్షాః సుఖం వసేత్!
పూర్వే వయసి తత్కుర్యాత్ యేన వృద్ధః సుఖం వసేత్!
యావజ్జీవేచ తత్కుర్యాత్ యేనా2ముత్ర సుఖం వసేత్!!
మహాభారతము-ఉద్యోగ పర్వము

రాత్ర్రి సుఖముగా నిద్రించగలుగునట్లు అవసరమైన పనులను పగలే గావించుము;వర్షర్తువునందు నిర్విచారముగా గడపుట కవసరమైన పనులను మిగిలిన ఋతువులలో చేయుము;ముసలితనమందు సుఖజీవనమునకై పడుచుదనమున కష్టించి కృషి చేసి కూడబెట్టు కోవలెను; పరమున సద్గతులకై యిహమున అవసరమైన సత్కార్యముల నొనర్పుము.

ఆకాలానికే కాదు,ఈకాలానికే కాదు,ఏకాలానికైనా-ఇదే అనుసరించాల్సిన మార్గం.కాదంటారా?

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ఈ ఒక్క శ్లోకం చాలు మన జీవితాన్ని ఆనందమయంచేసుకోవడానికి.

సుజాత వేల్పూరి said...

విజయ మోహన్ గారు,
బాగా చెప్పారు సుమా!