న దేవాంశో దదాత్యన్నం

November 4, 2008

శ్లో!!
న దేవాంశో దదాత్యన్నం!
నారుద్రో రుద్ర మర్చ్యతే!
నా నృషిః కురుతే కావ్యం!
నావిష్ణుః పృథివీపతిః!!


దేవతాంశ లేనియెడల అన్నదాత కాజాలడు; రుద్రాంశ లేనిచో రుద్రుని అర్చించడు; ఋషి గానిచో కావ్యమును రచించలేడు; విష్ణు అంశ లేనివాడు రాజ్యపాలకుడు కాలేడు.

పై నాల్గింటిలోనూ క్రింది రెండిటిని తరచుగా వింటూంటాం.ఈ మాటలు ఏ శ్లోకం లోనివబ్బా అని అనిపిస్తుండేది.ఇప్పటికా శ్లోకం దొరికి సంతోషంగా అనిపించింది.

2 comments:

రాఘవ said...

ఈ శ్లోక మెందులోదండీ?

Unknown said...

రాఘవ గారూ
మహీధర జగన్మోహనరావు గారి "సూక్తిముక్తావళి" లోని 'రాజనీతి ధర్మములు' ప్రకరణం లోని మొదటి శ్లోకం ఇది.వారు కూడా శ్లోకం ఎక్కడిదో తెలియజేయలేదు.