September 15, 2009
శ్లోII
అమ్భోజినీవనవిహారవిలాసమేవ
హంసస్య హన్తునితరాం కుపితో విధాతా,
న త్వస్య దుగ్ధజలభేదవిధౌ ప్రసిద్ధాం
వౌ దగ్ధ్యకీర్తి మపహర్తుమసౌ సమర్థః. 14చ
వనజభవుండు కోపమున వాహనమైన మరాళభర్తకున్
వనజవనీవిహారకలనంబుఁ దొలంగఁగఁ జేయుఁగాని గుం
భనమున దుగ్ధజీవన విభాగవిధాననిరూఢనైపుణి
జనితమహాయశోిభవసారము హంసకు మాన్పఁజాలునే.
బ్రహ్మ కోపముచే తన వాహనమైన హంసరాజును తామరవనములో తిరుగకుండ జేయునే గాని, పాలు నీటిని వేఱు పఱచుటవలన గలిగిన ప్రతిష్టను మాటచే హంసకు పోగొట్టగలుగునా.
బ్రహ్మదేవుడికి కూడా అలవిమాలిన పనులు కొన్ని కొన్ని ఉంటాయి అని మనకు ఇందుమూలంగా తెలుస్తున్నది.
0 comments:
Post a Comment