November 14, 2009
శ్లో II
ఋణానుబంధరూపేణ , పశుపత్నీసుతాలయాః ,
ఋణక్షయే క్షయం యాంతి , కా తత్ర పరిదేవనా ?
పశువులు , భార్యాపుత్రాదులు , ఇండ్లు వాకిండ్లు - ఇవి ఋణానుబంధ రూపముగా వచ్చి ఋణము తీరగనే మళ్ళీ మనుష్యుని వదలిపోతున్నాయి . అట్టివాటిని గూర్చి ప్రాజ్ఞులు విచారించరు గదా ! నిజమే.
ఇది వఱకు పోస్టు చేసిన పోస్టునే మళ్ళీ ఇంకోసారి పోస్టు చేస్తున్నందుకు నన్ను మన బ్లాగ్మిత్రులందరూ క్షమించాలి.
సుమారు 11 -12 సంవత్సరాలుగా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మా ట్రిక్సి ( లల్లూ - ముద్దుపేరు ) - అందమైన శునకం ( ఆడది - ఎన్నో పిల్లల్నందించింది మాకు, ఎందరికో ఇచ్చాం ), అటువంటిది కేవలం ఒక్కరోజు అస్వస్థత తోనే మమ్మల్ని విడిచి కన్ను మూసింది. ఎంత మనస్సును గట్టి పఱచుకుందామన్నా వీలుకావటం లేదు . బహుశః నేను ప్రాజ్ఞుడిని కాకపోవటం వల్లనేనేమో . తనతోడిదే లోకంగా ఉంటూ వచ్చిన మా ఆవిడనెలా ఓదార్చను ? తెలియటం లేదు. కాలమే అన్నిటికి సమాధానం చెపుతుంది .
0 comments:
Post a Comment