వ్యాళం బాలమృణాళత న్తుభిరసౌ రోద్ధుం సముజ్జృమ్భ తే

July 25, 2009

శ్లోII
వ్యాళం బాలమృణాళత న్తుభిరసౌ రోద్ధుం సముజ్జృమ్భ తే
భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమప్రా న్తేన సన్న హ్యతి,
మాధుర్యం మధుబిన్దునా రచయితుం క్షారామ్బు ధేరీహతే
మూర్ఖాన్యః ప్రతి నేతుమిచ్ఛతి బలాత్సూక్తైః సుధాస్యన్దిభిః. 5
మ.
కరిరాజున్ బిసతంతు సంతతులచేఁ గట్టన్ విజృంభించు వాఁ
డురువజ్రంబు శిరీషపుష్పములచే నూహించు భేదింపఁ, దీ
పు రచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబుం జిందు, యత్నించు ని
ద్ధరణిన్ మూర్ఖులఁ దెల్పు నెవ్వఁడు సుధాధారానుకారోక్తులన్.
తా.
ఈ భువిలో నెవడు అమృతధారల వంటి మాటలచే మూర్ఖులకు దెలివి గలిగింప యత్నించునో, వాడు గజేంద్రమును తామరతూడులోని దారములచే గట్టుటకు ప్రయత్నింినవాడగును; వజ్రమణిని దిరిశనపూలచే పగులగొట్ట దలంచిన వాడగును; ఉప్పు సముద్రమునకు తీపి గల్దించుటకు తేనెబొట్టును రాల్చువా డగును.

మూర్ఖుల లక్షణాలను ఇంతకంటే బాగా ఇంక ఎవరూ వివరించి ఉండరు. వారిని మార్చటం ఎంత కష్టమో ఇందు బాగా వివరింపబడింది.

0 comments: