April 18, 2009
శ్లో
ప్రసహ్య మణిముద్ధరే న్మకరవక్త్రదంష్ట్రాన్తరా
త్సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మిమాలాకులం
బుజఙ్గమపి కోపితం శిరసి పుష్పవద్ధారయే
న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాధయేత్.౩
చ.
మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింప వచ్చుఁ, బా
యక చలదూర్మికా నికరమైన మహోదధి దాఁట వచ్చు, మ
స్తకమునఁ బూవుదండవలె సర్పమునైన భరింప వచ్చు, మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్యమేరికిన్.
మొసలి నోటిలో నున్న మాణిక్యమును వెలికితీయవచ్చును. ఎడతెగక యలలచే కదలాడుచున్న మహాసముద్రమును దాటవచ్చును. తలపై పూలమాలవలె పాము నైనను ధరింపవచ్చును. కాని ఆసక్తి గొల్పి మూర్ఖుని మనస్సునకు దెల్పుట ఎవ్వరికిని సాధ్యము గాదు.
అందుకే చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు- అన్నారింకోచోట పెద్దలు.
0 comments:
Post a Comment