స్వల్ప స్నా యువసావసేక మలినం నిర్మాంసమప్యస్థి గోః

April 17, 2009

శ్లోII
స్వల్ప స్నా యువసావసేక మలినం నిర్మాంసమప్యస్థి గోః
శ్వా లబ్ధ్వా పరితోష మేతి న చ త త్తస్య క్షుధాశాన్తయే,
సింహోజమ్బుకమఙ్క మాగతమపి త్యక్త్వా నిహన్తి ద్విపం
సర్వః కృచ్ఛ్రగతో2పి వాఞ్చతి జనః సత్త్వానురూపంఫలమ్.౨౨II
ఉ.
స్నాయువసావసేకమలినమ్మగు నెమ్ము గ్రహించి జాగిలం
బాయతమోదమందుఁ జన దాఁకలి దానికిఁ, జెంత నున్న గో
మాయువు దానిఁ జూచి పరిమార్పక సింగము దంతిఁ గూల్చు, నే
చాయల నెల్లవారు నిజ సత్త్వసమాన ఫలార్థులే కదా.

నరములు, కొవ్వు వీనిచే ముఱికియయిన యెముకను గ్రహించి కుక్క మిక్కిలి సంతోషపడును గాని దాని కాకలి తీరదు. సింహము దగ్గర నున్న నక్కను జంపక యేనుగునే చంపును. ఎల్లవారును తమ శక్తికి దగిన ఫలమునే కోరుదురు.

అవును మరి. తమ తమ స్వభావానుగుణంగానే మసలుకుంటారెవరైనా. మనం మనుషులం. ఎదుటివారికి సహాయపడటం మన స్వభావంలోనే ఉంది. మనందరం దాన్ని పైకితీసి ఒకరికొకరం సహాయపడుతుండాలి ఎప్పుడూను.

0 comments: