April 20, 2009
శ్లోII
యదా కించిద్ జ్ఞో2హం గజ ఇవ మదాన్ధః సమభవం
తదా సర్వజ్ఞో2స్మీత్యభవదవలిప్తం మమ మనః,
యదా కించిత్కించిద్బుధజనసకాశాదవగతం
తదా మూర్ఖో2స్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః.II౭
చ.
తెలివి యొకింత లేనియెడఁ దృప్తుఁడనై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిఁ దొల్లి యిప్పు డు
జ్జ్వలమతు లైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాఁడ నై మెలఁగితిం గతమయ్యె నితాంతగర్వమున్.
కొంచెము తెలివిలేనప్పుడు గర్వముతో నేనుగువలె సర్వము తెలియునని గర్వబుద్ధితో పూర్వము మెలిగితిని. ఇప్పుడు విజ్ఞులగు పండితులవద్ద కొంచెము బోధ నెఱింగి తెలియనివానివలె మెలగుచున్నాను. నా గర్వమంతయు గతించినది.
0 comments:
Post a Comment