April 21, 2009
శ్లో
శిరశ్శార్వం స్వర్గాత్పశుపతిశిరస్తః క్షితిధరం
మహీధ్రాదుత్తుఙ్గా దవని మవనేశ్చాపి జలధిం,
అధో గఙ్గా సేయం పదముపగతా స్తోక మథనా
వివేక భ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః.౯
శా.
ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకంబునందుండి య
స్తోకాంభోధిఁ, బయోధినుండి పవనాంధోలోకముం జేరె గం
గాకూలంకష పెక్కు భంగులు వివేకభ్రష్ట సంపాతముల్.
గంగానది ఆకాశమున నుండి శివుని శిరస్సును, అందుండి హిమాలయమును, పుణ్యవంతమగు హిమాలయము నుండి భూమిని, భూలోకమునుండి మహా సముద్రమును, సముద్రమునుండి నాగలోకమును జేరెను. తెలివిమాలినవారి పాట్లు అనేక విధములుగా ఉంటాయి.
చిన్నప్పుడు స్కూలులో రిసైటేషను పద్యంగా దీన్ని నేర్చుకున్నాను. అప్పటినుండి ఈ పద్యం అంటే ఎంతో ఇష్టం. ఈ రోజుకి దీనిని బ్లాగులో పెట్టగలిగాను. చాలా సంతోషంగా ఉంది.
0 comments:
Post a Comment