ధర్మేచా2ర్థేచ కామేచ!

October 30, 2008

శ్లోII
ధర్మేచా2ర్థేచ కామేచ! మోక్షేచ భరతర్ష భ!
యదిహా2 స్తి తదన్యత్ర! యన్నేహాస్తి న తత్క్వచిత్!!

భరతశ్రేష్ఠుడా!ధర్మ అర్ధ కామ మోక్షము లనే చతుర్విధ పురుషార్ధములను బోధించే వచనము లేవి యిందులో ఉన్నవో అవే సమస్త యితర గ్రంథములలోనూ ఉన్నవి. దీనిలో లేనివి మరి యెచ్చటను లేవు. గాన దీనిని తప్పక చదువుము. ఇది మహాభారత విషయములో వ్యాసుల వారు చెప్పినది.

మహాభారత గ్రంథం మనం అందరం ఎందుకు పఠించాలో వ్యాసులవారు ఈ శ్లోకం ద్వారా మనందరికీ తెలియజేసారు.కవిత్రయం వారి భారతాన్నైనా ముందుగా మనం చదువుకోవటానికి ప్రయత్నిద్దాం రండి.ఆ తరువాత వ్యాసభారతం.

1 comments:

subramanyam K.V. said...

స్వామీ , మీరు వ్రాస్తున్న భావములు చాల చాల బాగుంటున్నాయి .ఈ శ్లొక భావము బాగా నచ్చి నా బ్లొగ్ లో దీనిపై ఒక చిన్న వ్యాసం వ్రాసాను , అందులో మీరు ఇక్కడ పొందుపరిచిన భావము లో కొన్ని వాక్యాలను యధాతధం గా వాడు కున్నాను .ఆ వ్యాసం యొక్క లింక్ http://kvsubramanyam.wordpress.com/2009/04/19/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%82-%e0%b0%8e%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%9a%e0%b0%a6%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/

మీ కెమైనా అభ్యంతరం ఉన్న యెడల దయచేసి తెలియచేయండి.
ధన్యవాదములు