January 22, 2010
శ్లో II
పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో,
మఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నం,
బ్రహ్మద్వేషః ఖలజరతిః ప్రాణినాం నిర్దయత్వం,
మభూ దేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు.
ఓ పశుపతీ ! పౌరోహిత్యము, జాగరణము, గ్రామాధిపత్యము, నియోగము, మఠాధిపత్యము, అసత్యవాదిత్వము, సాక్షిగ బోవుట, పరాన్నభోజనము, బ్రాహ్మణ ద్వేషము, దుష్టసాంగత్యము, నిర్దయత్వము - యివి నాకు జన్మజన్మాంతరములకూ కలుగనీయవద్దు, స్వామీ !
ఏఏ విషయాలను వర్జిస్తూ ఉండాలో చక్కగా చెప్పబడింది. కాని అందరూ పైవాటినన్నింటినీ వర్జిస్తే ఆ యా పనులు చేసేవారెవరుంటారింక ?
6 comments:
"పౌరోహిత్యము, జాగరణము, గ్రామాధిపత్యము, నియోగము, మఠాధిపత్యము"
ఈ విషయాలు నాకు మంచిగా అనిపిస్తున్నాయి. మరి వీటిని ఎందుకు వర్జించాలండి,
దయచేసి వివరించగలరు
భవదీయుడు
అప్పారావు శాస్త్రి
ఇవన్ని జనాల చే చీవాట్లు తినటానికి ఆస్కారము ఉన్నా వృత్తులు కదండీ.
పురోహిత్యం చేయటం అంటే (గుడి పూజారిగా కాదు, పుర జనులకు చేసి పెట్టే పనులు), అర్హులకు అనర్హులకు వారి కోర్కెలు తీరటానికి జపాలు చేసి దానాదులు తీసుకోని లేని పోనివి అంట కట్టుకొని, అంత తిన్నాడు, ఇంత తీసుకొన్నాడు అని మాట పడటమే కదా !
అలాగే నియోగిత్వం .. పెద్దలకు పేదలకు మధ్య ఉంటూ అందరి చే మాటలు పడటం.
గ్రామాధిపత్యం లో ఉండే కష్టం రోశయ్య గారిని, మఠాధిపత్యము లో కష్టాలు జయేంద్ర సరస్వతి స్వామీ గార్ని అడిగితే తెలుస్తుంది.
ఇవన్ని చాలా జాగురతతో చెయ్యవలసిన పనులు. ఎలా చేసినా, ఎంత రాజ పూజ్యం ఉన్నా, మాట పడటం, పాపం మూట కట్టుకోవటం తప్పదు.
అయితే అందరూ వదిలేస్తే ఎవరు చెయ్యాలి? ఎవరన్న చెయ్యని నాకు వద్దు అని రచయిత కోరుకోవటం లో తప్పులేదు.
నిజమేనండి, నేను అంత దూరం ఆలోచించలేదు
ఎందుకంటే వాటి వలన కొన్ని కొన్ని సందర్భాలలో పరుల దోషాలు మన నెత్తికి అంటబడతాయి.... అవతలి వారి కర్మ మనం అనుభవించాలి అంటే అది ఎంత దీనమైన పరిస్థితి.....
అందుకే....
శంకరభగవత్పాదుల వారు సమాజం కోసమే రాసి ఇచ్చినది అండీ ఇది 🙏🏻
రజనిచరితం అంటే రాత్రి సమయంలో చేసేకార్. ఈ పద్యంలో దొంగతనం అని భావించ వచ్చు.
Post a Comment