ఉత్తమా కులవిద్యా యా, మధ్యమా కృషివాణిజాత్,

December 4, 2009

శ్లో II
ఉత్తమా కులవిద్యా యా, మధ్యమా కృషివాణిజాత్,
అధమా సేవికా వృత్తిః, మృత్యుః చౌర్యోపజీవనమ్. హితోపదేశము.

అనుశ్రుతమైన కులవిద్యవల్ల జీవించుట ఉత్తమపక్షము; వ్యవసాయవాణిజ్యములచే జీవించుట మధ్యమము; సేవకవృత్తి అధమము.--ఈ మూడూ గాక దొంగతనము మొదలైన పరమ నింద్యకర్మలచే జీవించుట మరణము ( తో సమానము ) .

రాను రాను అందరూ ( అధమమైనదైనా సరే ) ఉద్యోగాలే చేయాలని కోరుకోవటం నేటి పరిస్థితి. ఇది ఎప్పటికి మారుతుందో కదా !

0 comments: