ఉత్తమం స్వార్జితం విత్తం

February 5, 2009

శ్లో!!
ఉత్తమం స్వార్జితం విత్తం!
మధ్యమం పితురార్జితం!
అధమం భ్రాతృవిత్తంచ!
స్త్రీ విత్త మధమాధమం!

స్వార్జిత ధనముతో జీవయాత్ర గడపుట ఉత్తమపక్షము. పితురార్జితముతో జీవితము గడపుట మధ్యమపక్షము. సోదరుల సంపాదనపై బ్రతుకుచుండుట అధమ స్ధితి. ఇక అధమాధమమైనది స్త్రీల ధనముతో జీవించుచుండుటయే.

సంపాదనా మార్గములలో ఉత్తమ, మధ్యమ, అధమ స్థితులను తెలుపుటయే కాక ఏది అధమాధమమైనదో కూడా తెలియ జేయటం జరిగింది. ధీన్నిబట్టి మనుజులు వారి వారి మార్గాలను నిర్ణయించుకోవలసి ఉంది.

1 comments:

ఆత్రేయ కొండూరు said...

కం:
విత్తము నీ దయినదిభళి
అత్తల సొమ్మయినచోట అదిబహు భళీ
మొత్తము పరధన మన్నచొ
నెత్తిన పదవులు పెడుదురు నేతలు సాక్షీ

వేదుల వారికి నమస్కారము. ఇప్పుడు ఉన్న పరిస్థితి చెప్పాను. అసందర్భము అనుకోను. మంచి విషయాలను అందిస్తున్నారు. ధన్యవాదాలు.