December 20, 2009
శ్లో II
జరా రూపం హరతి ధైర్య మాశా , మృత్యుః ప్రాణాన్ ధర్మచర్యా మసూయా ,
కామో హ్రియం వృత్త మనార్యసేవా , క్రోధః శ్రియం సర్వ మేవాభిమానః .
ముసలితనము రూపాన్నీ , ఆశ ధైర్యమును , మృత్యువు ప్రాణాలను , అసూయ ధర్మప్రవృత్తినీ , కామము లజ్జను , దుష్టసేవ సత్ప్రవర్తనను , కోపము ఐశ్వర్యమును , గర్వము సర్వమును హరించివేస్తాయి .
మొదటిదాన్నీ మూడోదాన్నీ ఎలానూ తప్పించుకోలేం. కనుక మిగిలినవాటినైనా వదిలించుకొనే ప్రయత్నం చేద్దాం.
4 comments:
ఆశ, ధైర్యమును ఏవిధంగా హరిస్తుందండి, నేను అర్ధం చేసుకోలేక పోతున్నాను
కనుక దయచేసి వివరించగలరు
భవదీయుడు
అప్పారావు శాస్త్రి
ధైర్యవంతుడికి ఆశ పడటం అనేది అవసరం లేదు. ఎందుకంటే అతనికున్న ధైర్యం దేన్నైనా కష్టపడి సాధించగలననే నమ్మకాన్ని అతనికి ఇస్తూంటుంది. ఆశ పడటం అంటే - ఓ విధంగా కష్టపడకుండా వచ్చేదాన్ని గుఱించి ఆలోచించటం . ఇది ప్రారంభమైతే మనిషిలో స్వతహాగా ఉన్న ధైర్యం ( కష్టపడి దేన్నైనా సాధించగలననే నమ్మకం, పట్టుదల ) తగ్గటం ప్రారంభమౌతుంది. ఆ విధంగా ఆశ ధైర్యాన్ని హరించివేస్తుందని భావం. నేను సరిగ్గా వివరించగలిగానో లేదో తెలియటం లేదు.
మీరు సరిగానే వివరించారు
మీరు సరిగానే వివరించారు
Post a Comment