December 4, 2009
శ్లో II
అగ్నిహోత్రం గృహం క్షేత్రం , గర్భిణీం వృద్ధబాలకౌ ,
రిక్తహస్తేన నోపేయాత్ , రాజానాం దైవతం గురుమ్ . మనుస్మృతి
అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీ, ముసలివారు, బాలురు, రాజు, దైవము, గురుడు - వీరివద్దకు బోవునప్పుడు వట్టిచేతులతోపోరాదు. ఏదో పండునైన, పూవునైన తీసుకొనిపోయి, సమర్పించ వలెను.
ఎన్నెన్ని మంచి మంచి విషయాల్ని మన పెద్దలు మనకు చెప్తున్నారో కదా. ఇదేకదా మన సంస్కృతీ, సాంప్రదాయమూను . ఇన్నిన్ని మంచి విషయాలను చెప్తున్న మనుస్మృతిని కొంతమంది ఈరోజుల్లో కూడదంటున్నారెందుకో తెలియదు.
1 comments:
ఆహా, అద్భుతమైన శ్లోకమండీ! నెనర్లు.
Post a Comment