విద్యానామ నరస్య రూపమధికం

October 31, 2008

శ్లో!!
విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం!
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యాగురూణాం గురుః!
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం!
విద్యా రాజసుపూజ్యతే నహి ధనం విద్యావిహీనః పశుః!! భర్తృహరి.నీతి.16.

ఉ.
విద్య నిగూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుఁడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాఁజు మర్త్యుడే. ఏనుగు లక్ష్మణ కవి

మానవులకు విద్యయే సౌందర్యము;అదియే గుప్త ధనము; చదువే కీర్తిని,సుఖమును,భోగమును కలిగించును; విద్యయే గురువులకు గురువైనది; విదేశములకు పోయినపుడు విద్యయే బంధువు; అదియే మరొక కన్నువంటిది; రాజసభలలో పూజార్హత విద్యకే గాని ధనమునకు గాదు. ఇంతటి శ్రేష్ఠమైన విద్య లేని నరుడు వింతపశువు మాత్రమే.

ఈ శ్లోకాన్ని మనమందరం ధారణ చెయ్యాలి.అంతేకాదు మనపిల్లలందరిచేతా కూడా ధారణ చెయ్యించాలి.అప్పుడే,అంటే చిన్నతనంలోనే వాళ్ళకి చదువు,దాని ఉపయోగాలు పూర్తిగా తెలిసేది.

0 comments: